కళ్ళజోడు(బాలగేయం);---గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.
అందమైన కళ్ళజోడు
అవసరమే కళ్ళజోడు
నాసికపై నాట్యమాడు
నయనాలకూ సరిజోడు

దూరదృష్టి తరుముతుంది
హ్రస్వదృష్టి నాపుతుంది
దృష్టి లోపం సరిచేసి
వెలుగుమయమే చేస్తుంది

తలనొప్పిని తరిమికొట్టు
నేత్రాలకు కాపు పెట్టు
పాఠక మహాశయులకు
అక్షరాలను  చూపెట్టు

చెవులపైకెక్కుతుంది
అందాన్ని పంచుతుంది
కళ్ళజోడు మనుజులకు
అవసరాలు తీర్చుతుంది


కామెంట్‌లు