కధ కవితలా సాగితే
కదిలిస్తుందని...
కవి వర్ణిస్తే కధనం
కనుల మెరసి కన్నీరు
పెట్టిస్తుందని...
గోరు వెచ్చని
నీరే అయినా ఎదను
తాకగా కొండలాంటి
గుండెను సైతం
కరిగిస్తుందని...
లోటుపాట్లను వివరించిన...
కట్టుబాట్లను ప్రశ్నించిన...
వాస్తవాల బాణాలు సంధించిన...
సలహాలు, సూచనలు అందించిన...
నిగ్గు తేలని నిజాల గుట్టురట్టు చేసిన...
సిగ్గులేని సమాజాన్ని నడిరోడ్డున
నిలబెట్టి నిలదీసిన...
నువ్వేమి చేశావు నేరం అంటూ
జాలి చూపించిన...
ఎవ్వరినెప్పుడు
తన వలలో అంటూ ప్రేమ
ఆనవాళ్ళను అక్షరాలలో బంధించిన...
భావాలే బాణీలుగా...
గమ్మతైన మాటలే గమకాలుగా...
ప్రయాస పడుతూ ప్రాస గూర్చిన
పదాలే పదనిసలు పలికిస్తాయని...
దుడుకు వయసైనా, అలిగిన మనసైనా,
ఆగి దాగిన అంతరార్థాలను
ఆలోచిస్తుందని...
వారి కలం పలికిన ప్రతి పదం
ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుందని...
సమాధానం కూడా వారికి
సమాధానాన్ని ఇవ్వడానికి
సందేహిస్తుందని...
అనుకోలేదు…
నేనెప్పుడు…అనుకోలేదు
కదిలిస్తుందని...
కవి వర్ణిస్తే కధనం
కనుల మెరసి కన్నీరు
పెట్టిస్తుందని...
గోరు వెచ్చని
నీరే అయినా ఎదను
తాకగా కొండలాంటి
గుండెను సైతం
కరిగిస్తుందని...
లోటుపాట్లను వివరించిన...
కట్టుబాట్లను ప్రశ్నించిన...
వాస్తవాల బాణాలు సంధించిన...
సలహాలు, సూచనలు అందించిన...
నిగ్గు తేలని నిజాల గుట్టురట్టు చేసిన...
సిగ్గులేని సమాజాన్ని నడిరోడ్డున
నిలబెట్టి నిలదీసిన...
నువ్వేమి చేశావు నేరం అంటూ
జాలి చూపించిన...
ఎవ్వరినెప్పుడు
తన వలలో అంటూ ప్రేమ
ఆనవాళ్ళను అక్షరాలలో బంధించిన...
భావాలే బాణీలుగా...
గమ్మతైన మాటలే గమకాలుగా...
ప్రయాస పడుతూ ప్రాస గూర్చిన
పదాలే పదనిసలు పలికిస్తాయని...
దుడుకు వయసైనా, అలిగిన మనసైనా,
ఆగి దాగిన అంతరార్థాలను
ఆలోచిస్తుందని...
వారి కలం పలికిన ప్రతి పదం
ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుందని...
సమాధానం కూడా వారికి
సమాధానాన్ని ఇవ్వడానికి
సందేహిస్తుందని...
అనుకోలేదు…
నేనెప్పుడు…అనుకోలేదు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి