బంగారు భాగ్యనగరం ;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 ప్రకృతి సోయగాల 
సుందర నగరం...
ఆధునికతను అందిపుచ్చుకున్న 
అద్బుత నగరం...
రంగురంగు నీడల,
అద్దాల మేడల 
అందాల నగరం....
హొయలొలికే 
సినిమా హాళ్ళ,
షాపింగ్ మాళ్ళ 
హైటెక్ నగరం....
వినూత్న 
వ్యవహారాల 
విభిన్న నగరం
వినోద నగరం...
యువత భవిష్యత్తుకు 
భరోసా అందిస్తున్న
బంగారు నగరం 
మన భాగ్యనగరం...


కామెంట్‌లు