మొదటి బహుమతి! అచ్యుతుని రాజ్యశ్రీ

ఆరోజు కాలనీలో హరి ఇల్లు మహా సందడిగా ఉంది. దానికి  కారణం అతనికి ప్రముఖ మాసపత్రిక పోటీలో ఫస్ట్ ప్రైజ్ రావటం! స్నేహితులు అందరికీ  పెద్ద విందు ఏర్పాటు చేశాడు. 50వేల బహుమతి అంటే మాటలా?! దాదాపు వెయ్యి కథలు  వడపోత లోఆఖరుగా 10 బరిలో మిగిలాయి.అందులో 5చివరి రౌండ్ దాకా నిల్చాయి.ఆఖరికి హరి రాసిన కథ అందలం ఎక్కింది. విందు ప్రారంభానికి ముందు అందరూ హరిని పూలదండలతో పొగడ్తలతో ముంచెత్తారు. ఆకాశానికి ఎత్తేశారు. మందే విందు ఇస్తే  అక్కడ ఒకరిద్దరు తప్ప  ఎవరూ ఉండరని తెలుసు. అందుకే  తెలివిగా భజన పొగడ్తల కార్యక్రమం ఐనాక భోజనం ఏర్పాటు చేశాడు. ఆఖరి వరుసలో  శివా మాష్టారు కూచున్నారు.హరిపిల్లలు ఆయన దగ్గరికే ట్యూషన్ కి వెళ్తారు. శివా ఒకానొకప్పుడు మంచి చేయితిరిగిన రచయిత. 1960-70లలో ప్రతి పేపర్ వార మాసపత్రికలలో అన్నిటిలో ఆయన పేరే కనపడేది.పారితోషికం కోసం  ఆశపడని వ్యక్తి!చెంచాగిరి చేతకాదు.పోస్ట్ లో పంపేవాడు.ఓరోజు మాష్టారు  తను రాసిన కథను హరికి ఇచ్చి  చదవమన్నారు.హరికి కాస్తో కూస్తో  సాహిత్యం పై అవగాహన ఉంది. ట్యూషన్ చెప్పినందుకు వెయ్యి రూపాయలు ఠంచన్ గా ఇస్తాడు.రిటైర్ ఐన మాష్టారు  కథ కవిత రాస్తూ కాలక్షేపం చేస్తారు.భార్య పోయింది. కొడుకు దగ్గర ఉంటాడు. చేతిరాత బాగా కుదరటంలేదు."నేను ఫెయిర్ చేస్తాలేండి మాష్టారు!"అని  కథను తీసుకుని పోటీకి పంపి బహుమతి కొట్టేశాడు హరి!శివా  తన కథ విషయం  ఎప్పుడో మర్చిపోయాడు.విందుకి ముందు  శివామాష్టారికి పంచెలచాపు 500రూపాయలు  బుట్టెడు పళ్ళతో సత్కరిస్తున్న హరిని అంతా ప్రశంసలతో ముంచెత్తారు. కానీ లోగుట్టు పెరుమాళ్ల కెరుక! తన కథని హరి అనే పేరు తో పంపి ప్రైజు కొట్టేశాడు. మంచి హోదా లో ఉన్న  కాకాబాకా హరిమాటలు అంతా నమ్ముతారు కానీ 60దాటిన దిగులు వ్యధతో ఉండే శివా మాష్టారి మాటలు ఎవరూ నమ్మరు.అందుకే  ఆయన నోరున్న మూగమనసులా ఉండిపోయాడు.అందుకే అంటారు "సొమ్ము ఒకడిది-సోకు ఒకడిదని"🌹
కామెంట్‌లు