" మాన్య ప్రశస్త ఆకాంక్ష "(బాలగేయం);---గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.
నాన్న మాటలు వింటాను
వెన్నముద్దనై ఉంటాను
వెన్నంటి ఉండే నాన్న
మిన్నని నేను  అంటాను

బామ్మకు సాయపడుతాను
బొమ్మల కొలువు చూస్తాను
కొమ్మ కొమ్మకు కాసే
కమ్మని ఫలం అవుతాను

మల్లెపూవునవుతాను
కొల్లగ తావులిస్తాను
చల్లని గాలినవుతాను
ఎల్లరి మదిని దోస్తాను

చుక్కల్లా వెలుగుతాను
మొక్కల్లా ఎదుగుతాను
చక్కని దారుల్లోన
పక్కిలా విహరిస్తాను


కామెంట్‌లు