తెలుగుపూలు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అదిగో ఆపూలతోటనుచూడు
అందమైన తెలుగుపూలు
అందరిని అలరిస్తున్నాయి
ఆనందాన్ని కలిగిస్తున్నాయి

ఆవికసించిన మల్లెపువ్వునుచూడు
వయ్యారాలను ఒలకబోస్తూ
పరిమళాలను వెదజల్లుతూ
అంతరంగాన్ని కట్టిపడవేస్తుంది

ఆ అందాలరోజాపువ్వునుచూడు
చెంతకురమ్మని సైగచేస్తుంది
కబుర్లు చెప్పమంటుంది
కాలాక్షేపం చేసుకుందామంటుంది

ఆమనోహర మందారపువ్వునుచూడు
పూర్తిగా విచ్చుకుంది
అందాలను ఆరబోస్తుంది
ఆడుకుందాం రమ్మంటుంది

ఆ ముద్దబంతినిచూడు
ముద్దులొలుకుతుంది
ముచ్చటగాయున్నది
మయినిమరిపిస్తున్నది

ఆ చామంతినిచూడు
సొగసుగాయున్నది
సరసాలకు రమ్మంటుంది
సరదాలు చేసుకుందామంటుంది

తెలుగుతోటను చూడు
తెలుగుపూలను చూడు
తెలుగుసొగసులు చూడు
తెలుగువెలుగులు చూడు

తెలుగు కవిగారు
తెలుగుపూలమీద
చక్కనిరెండుపద్యాలను చెప్పండి
చదువరుల మనసులుతట్టండి

తెలుగుపూలజూడ వెలుగులుచిందేను
తరుణులునలరులను తలనుదాల్చ
చూడముచ్చటయ్యి శోభిల్లుచుండును
పూలుచేసుకున్న పుణ్యమేమొ

మత్తుచల్లుచుండె మందారకుసుమంబు
గుండెలనుగులాబి గుచ్చుచుండె
బహుగబాగుగుండె బంతిచామంతులు
మనసునుతడుచుండె మల్లెపూవు


కామెంట్‌లు