ఇప్పుడంటే అందరూ తినడానికి స్టీలు ప్లేట్లు ఉపయోగిస్తున్నారు కానీ..ఇదివరకు రాతెండీ,ఇత్తడి,కంచు,మట్టి తళెలను ఉపయోగించేవారు...చిన్నప్పుడు మా పెద్ద బాపమ్మ దగ్గర రాతెండీ తళే చూసా...భలే డిజైన్ డిజైన్ ఉండేది..చిన్న బాపమ్మ దగ్గర కంచు తలె చూసా...బంగారు రంగులో నగిశీలు చెక్కినట్లుండేది...
ఇప్పుడు ఇళ్ళలో..చాలా మంది వెండి,బంగారు పళ్ళాలు ఉపయోగిస్తున్నారు లెండి...ఫంక్షన్స్ కి ప్లాస్టిక్ ,లేదా పేపరు ప్లేట్లు
కాని డబ్బు ఉన్నోళ్ళనైనా, లేనోళ్ళనైనా సమదృష్టితో చూసేవి ఈ ఆకు విస్తళ్ళే...ఎందుకంటే...డబ్బును కట్టలుకట్టలు ఎంతైనా దాచుకోవచ్చు...కాని..భోజనం మాత్రం ఎంత ఆకలి అవుతుందో అంతే..కడుపులో ఎంతపడుతుందో అంతే తినగలం కదా...
అరిటాకులు,తామరాకులు,మోదుగువిస్తరాకులలో బంతిలో కూచుండబెట్టి భోజనాలు పెట్టేవారు...కదా అప్పట్లో....పెళ్ళిళ్ళకీ,పేరంటాలకీ అన్ని రకాల ఫంక్షన్లకి వన్నె తెచ్చేవి ఆ బంతి భోజనాలు...
బాగా గ్రాండుగా జరిగిందని చెప్పుకోవడానికి సంఖ్యను ఉటంకిస్తూ చెప్పేవాళ్ళు...పదివేల మంది వచ్చారు అనకుండా...పదివేల విస్తళ్ళు లేచాయిరా అని...
ఇప్పటికీ అతిథిదేవోభవ అని నమ్మే మనం మన ఇంటికి వచ్చిన అతిథి తిన్న ఆకును మనమే తీస్తాం...అది చాలా గొప్పవిషయంగా భావిస్తాం...అంతేగాని...ప్రస్తుతం మనం అలంభిస్తున్న బఫె సిస్టంలో ఎవరి ప్లేటు వాళ్ళే డబ్బాలో వేయాలి అనుకోము.
సోషల్ పుస్తకాలలో చదివాము చాపకూడు అని...ఊరివారందరికీ భోజనాలు పెట్టి ఐక్యతను తీసుకొచ్చారు అని...భారతీయసాంప్రదాయం బహుగొప్పది కదా....కొన్ని సినిమాల్లో చూసాము..ఆర్ధికంగా బాలేని వారు ఊరివారికి భోజనాలు ఏర్పాటు చేస్తే...ఊరివారంతా ఆ భోజనం పెట్టినవారిని ఆర్ధికఇబ్బందులనుండి బయటపడేసేవారని...కొన్ని వింటూంటాం..చదువుంటాం...కలిసిమెలిసి ఉండాలంటే భోజనమే కదా కలిపేది...మనసు తడిచిపోతుంటుంది...కదండీ ఇలాంటివి వింటే
విస్తరిపై సామెతలు కూడా చాలానే ఉన్నాయి కదా....
వాళ్ళ జీవితం "వడ్డించిన విస్తరి "అని
"అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటే..ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతది "అని
"కుక్కలు చింపిన విస్తరి"-"ఎంగిలాకు" "నడిత్తార్ల తిని కొసిత్తార్ల మరిచిపోతర"ని
బోలెడు సామెతలు ...మా బాపమ్మ మాటకో శాత్రం వేసేది...ఇప్పట్లా రాసిపెట్టుకోవాలనే ధ్యాస ఉండింది కాదు.. :
విస్తరాకు భోజనం చాలా మంచిదంటారు... ఆహారజీర్ణానికి సంబధించిన సమస్యలుంటే నివారించి చక్కగా జీర్ణం చేసి ఆరోగ్యాన్నిస్తుంది..ఓసారి ఉపయోగించి కడిగిన ప్లేట్లు కాకుండా...నేను పూజలు వ్రతాలకు తప్పనిసరిగా ఈ ఆకులతోనే విస్తళ్ళు కుట్టి ఉపయోగిస్తాను...
విస్తళ్ళు కుట్టడం ఒక కళ ....కుట్టుమిషను కుట్టు,తినేటపుడు రాజభోగం,తిన్నాక లేకిరాగం..అనే ఓ పొడుపు కథ కూడా ఉంది...విస్తరిపై.
మోదుకు ఆకుల విస్తళ్ళు కుడుతుంటే...చెయ్యి తిరిగే విన్యాసం భలే అందంగా ఉంటుంది సుమండీ...మా చిన్నప్పుడు...మా అమ్మ పచ్చిమోదుకాకులు కుట్టి ఇసుర్రాయి కింద పెట్టేది...కాస్త అణిగాక ఎండలో పెట్టి ఎండాక మళ్ళీ ఇసుర్రాయి కింద పెట్టేది..బరువుకు మంచిగ అణిగి గుండ్రంగా అందంగా ఉండేవి...ఒక్కోసారి ఇంట్లో పనులెక్కువగా ఉంటే...బస్తాలో కోసుకొచ్చిన ఆకులను దండలుగా గుచ్చి ఎండబెట్టాక విస్తళ్ళు కుట్టేది....ఎండాకాలంలో కుట్టి పెట్టుకుంటే...సంవత్సరమంతా పండుగలు పబ్బాలకు సరిపోయేవి...
నిన్న సాయిబాబా ప్రసాదాలు పంచేందుకు కరోనా భయానికి బయట ప్లాస్టిక్ ,పేపర్ ప్లేట్లు కొనలేక...ఇలా...ఫ్రెష్షుగా...ఆకులు తెచ్చి ఉపయోగించాము..అదో తృప్తి .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి