జమ... ఖర్చు
*****
జమ... ఖర్చుల విషయంలో వ్యక్తిగా గుర్తు పెట్టుకోవాల్సినవి రెండు ఉన్నాయి.
అది ఒకటి ఆర్థికం, రెండు హార్థికం.
ఆర్థికంగా స్థిరపడేందుకు పైసా పైసా జమ చేసుకోవడానికి శ్రమించడం తప్పేం లేదు కానీ. మన ఆనందం కోసం, మన వాళ్ళకు సమయం కేటాయించకుండా ఎంత జమ చేసినా చివరకు మిగిలేది తీవ్రమైన ఒత్తిడి అసంతృప్తే.
హార్థికంగా కూడా... ఆత్మీయత,అభిమానం, మానవీయ విలువలతో కలగలిసిన గుర్తింపును జమ చేసుకుంటేనే సమాజంలో తగిన గౌరవాన్ని పొందగలం.
ఈ విషయంలో కొందరు గోడమీద పిల్లిలానో,ఊసరవెల్లిలానో మారి పై వాటి కోసం అంగలారుస్తూ ఉంటారు.
మొదట్లో వారి ప్రవర్తన అర్థం కాకపోయినా, తెలిసిన తర్వాత అందరిలో ఓ ఏహ్యభావం ఏర్పడే పరిస్థితి వస్తుంది.
ఈ రెండింటి విషయంలో మనల్ని మనం మోసం చేసుకోకుండా ఖర్చు పెట్టాల్సినవి సమయాన్ని, సంస్కారాన్ని...
అప్పుడే సంతోషం, గౌరవం మన ఖాతాలో జమ అవుతాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి