సుప్రభాత కవిత;-బృంద
రేయంతా  నింగిలో మెరిసిన
చుక్కలు
వెలుగొస్తుంటే  దిగివచ్చి
కొమ్మలో పూలై నవ్వేసాయి.

క్షణంలో మాయమైన
చుక్కల్ని వెదుకుతూ
మబ్బులు పరుగులెత్తసాగాయి.

తూరుపింట వేగుచుక్క
వేకువ వచ్చేస్తోందని
పరుగులాపమని  సైగచేసింది.

ఎర్రబారిన మొహంతో మబ్బులన్నీ
వరుసగా  చేతులు మోడ్చి
నిలబడి....భక్తిగా చూడసాగాయి.

చల్లని మలయసమీరాలు
పువ్వుల పరిమళాలు 
వెదజల్లుతూ  స్వాగతించసాగాయి.

మనోహరమైన సుందర దృశ్యం 
గగనంలో  భానుడి సాక్షాత్కారం

కన్నుల కింపైన కమనీయ ఉదయం
దోసిట పొసిన  వెలుగుల వరం

మరో రోజుకి ప్రారంభం
కావాలి అద్భుతమైన ఆరంభం

🌺🌺 సుప్రభాతం 🌺🌺


కామెంట్‌లు
koduru.sudgakara murthy చెప్పారు…
sun provoked sky to compet with the earth🙏