ఆనందం ఓ వెన్నెల పండుగ
అచ్చు ఓ ధారాప్రవాహంలా !...
ఆనందం కలిగిన మరుక్షణం
విరుద్ధ భావాలన్నీ సమసిపోతాయి
అందరినీ ఆత్మీయులుగా చూడగలం
క్రమంగా ఆనందానుభవం విస్తరిస్తుంది
ఉరికే జలపాతంలా మారిపోయి
ఇతరుల హృదయాలను ముంచెత్తుతుంది
వదనం సమ్మోహనరూపంగా ప్రకాశింపజేస్తుంది
అశాంతిని కూడా ఆనందంగా
మార్చుకునేందుకు పరాకాష్ట సాధనే !
-----------------------------

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి