సంయమనం!సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
 రోమన్ సామ్రాట్ జూలియస్ సీజర్ కి ఓశత్రువురాసిన లేఖ చేతికి చిక్కింది. చదివి వెంటనే  మంటలో పడేసి బూడిద చేశాడు. అతని సన్నిహిత మిత్రుడు అడిగాడు "ఎందుకు అలాచేశావు?నీశత్రువు  చెత్త చెడ్డ బుద్ధిని అందరిముందూ బైట పెట్టి పరువుతీస్తే బాగుండేది కదా?"దానికి సీజర్ జవాబు ఇది" దాని వల్ల ఏంలాభం? నల్గురూ అవాకులు చెవాకులు పేలుతారు.నన్ను ఖుషామద్ కోసం పొగుడుతూ చాటుగా  సీజర్ తిక్క కుదిరింది అని నవ్వేరకాలు!?నాకోపం పెరిగేలా పురెక్కిస్తారు.దాని వల్ల నాకే నష్టం! అందుకే తగలేశాను." మనంకూడా  నచ్చని వాటిని బుర్ర లోంచి బూజుని తొలగించినట్లు డిలిట్ చేయాలి. అవి మన ఎదురుగా ఉంటే కోపం ఉద్రేకం పెరుగుతాయి.మనసు ప్రశాంతంగా ఉంటుంది. 
విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ నౌకా దళమంత్రిగా ఉన్న రోజుల్లో నౌకా దళ అధికారి అడ్మిరల్ లార్డ్ ఫిషర్ కి చర్చిల్ అంటే ఒళ్లు మంట! ఆయన పదవి ఊడేలా ప్రయత్నిస్తూనే ఉండేవాడు. అగ్గిమీద గుగ్గిలంలాగా చిటపటలాడే ఫిషర్ ని పన్నెత్తి మాట అనని మనీషి చర్చిల్!కొన్ని దశాబ్దాలు గడిచాయి.ఆరోజు తీరికూచుని చర్చిల్ ఫ్రెండ్  ఫిషర్ ని దుమ్మెత్తిపోస్తున్నాడు.చర్చిల్ ప్రశాంతంగా ఇలా అన్నాడు " నేను ఉన్నత పదవిలో కూచోగానే ఫిషర్ కి నావికాదళంలో అత్యున్నత పదవి కట్టబెడతాను.మంచి సమర్ధుడు!" అంతే డంగైపోయాడు మిత్రుడు. ఇంకో విశేషం ఏమిటంటే ఫిషర్ తన జీవిత చరిత్రలో కూడా చర్చిల్ ని నానామాటలతో యాగీ చేశాడు. కానీ చర్చిల్ ఆపుస్తకంని తెగ మెచ్చుకుంటూ  ఫిషర్ కి స్వయంగా ఓలేఖరాశాడు. ఓసారి చర్చిల్ సభకి ఐదువేల మంది పైగా జనం హాజరైనారు."మిష్టర్ చర్చిల్!నీకెంత పాపులార్టీ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో!? జనం గుండెల్లో గూడు కట్టేశావు" అని ఎవరో మాటలతో ఉబ్బేశారు.ఆయన ప్రశాంతంగా "అయ్యోరామ! వారు నాఉపన్యాసం వింటానికి రాలేదు.తమాషా చూడాలని వచ్చారు.రేపు నన్ను ఇక్కడ ఉరితీస్తే 50వేలమంది పైగా పోగవుతారు..చూడు!" అన్నాడు. 
యు.ఎస్.ప్రెసిడెంట్ కాల్విన్ కూలిజ్ దేశాన్ని ఉన్నతపథంలో నడిపించాడు.ఎక్కువ మాట్లాడే వాడుకాదు.భార్య వాగుడుకాయ! భర్త తో  హస్క్ వేయాలని ఆమె ఉబలాటం! ఆయన మాత్రం "ఆ ..ఊ..ఓ.కే..సరే" తో సరిపెట్టేవాడు.ఓరోజు ఇద్దరు చర్చికి వెళ్లి నడుచుకుంటూ వస్తున్నారు. "ఏమండీ!చర్చీలో ఫాదర్ చెప్పింది విన్నారా?" ఆమె ప్రశ్నకు "ఓ..." ఆయన జవాబు! "ఆప్రవచనం దేన్ని గూర్చి?"  "పాపం ని గూర్చి!" "ప్లీజ్!నాకు వివరించరూ?" ముద్దు గా  గోముగా అడిగింది. 
"పాపం కి వ్యతిరేకంగా మాట్లాడాడు ఫాదర్!" అంతే!ఈమహానుభావుడిని మాట్లాడించి తనముచ్చట తీర్చుకోవాలి అనుకున్న ఆమె నిరాశతో పాపం అలిగింది. ఐనా ఆయనకు  అదీ తెలీదు. 
ఆల్బర్ట్ స్వైజర్ అనే రచయిత  ఓచిన్న సంఘటనను ఎంత నిశితంగా పరిశీలించాడో ఇది చదివితే  అర్ధంఅవుతుంది. జర్మనీ లోని తనమిత్రుని ఇంటికి వెళ్లాడు.ఆమిత్రుడు రోజూ పిట్టలకి ఆహారం గా గింజలు బ్రెడ్ ముక్కలు వేస్తాడు.ఓకాలులేని పిచ్చుక దగ్గర బ్రెడ్ ముక్కలు  గింజలు ఉన్నాయి. గుంపులుగా వచ్చి న  పిచ్చికలు దాని జోలికి పోలేదు. అక్కడ ఉన్న ఆహారం కై ఆశపడక దూరం గా ఉన్న  వాటినే ఏరుకుతినసాగాయి.మనుషులైతే కలియబడి ఎగబడి గుడి ప్ర సాదంకోసం ముందే క్యూ కడతారు.తొక్కిసలాటతప్పదు.
నిజంగా మనిషి ప్రకృతిని చూసి చాలా నేర్చుకోవాలేమో!?🌹

కామెంట్‌లు