శబ్ద సంస్కృతి!సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ
 రాజీనామా ఫారశీ శబ్దం. స్వీకృతపత్రం అని అర్ధం. నిజానికి వాది ప్రతివాదులు న్యాయాలయంలో కేసుకి  సంబంధించిన పత్రాలు సమర్పించటం! కానీ మరాఠీ లో దీన్ని త్యాగ పత్రం రాజీనామా గా వాడారు. పదవిని వదులుకునేందుకై రాసే లేఖ.
అవధీ బఘేలీ భాషల్లో ఉప్పుని  రామరసం అంటారు. ఎందుకంటే ప్రతి వంటకం కూర పచ్చడి ఆఖరికి మజ్జిగలో కూడా వాడుతాం!
రావత్ రావు పదాల అర్ధం ఒక్కటే! చిన్న చిన్న రాజులను రావ్ రావత్ అని పిలిచేవారు. రాజపురుషుడు అని అర్ధం. రావుత్ క్రమంగా రావుగా మారింది. రాజస్థాన్ జాగీరుదార్లని రావ్ అని పిలిచేవారు. మహా రాష్ట్ర లో కూడా బాజీరావు గంగాధరరావు అనే పేర్లున్నాయి. హిందీ పదం రౌతాయిన్ దాదాపు అన్ని భాషల్లో ఉంది. మరాఠీ లో గుర్రపుస్వారీ చేసే రౌతు అని అర్ధం. రాజవంశాలలో  పేరు చివర రావు ఉంటుంది. 
రాష్ట్ర కూటులు రాఠౌర్  పై భిన్నాభిప్రాయాలున్నాయి.రాఠౌడ్ వంశం కనౌజ్ లో ఉంది తొలుత. జోధ్పూర్ రాఠౌర్ వంశం చాలా ప్రాచీనమైనది. ఇంద్రుడి  రహట్ రీఢ్ అంటే వెన్నెముక నించి ఉత్పన్నం అవటంవల్ల రాఠౌడ్ అని పిల్వబడ్ఠారు.వీరి కులదేవత పేరు మీదుగా రాష్ట్రకూట్ రాఠౌడ్ వచ్చింది. జోధ్పూర్ లో ఈపేరుతో వందపైగా శాఖలున్నాయి.మాన్యఖేట్కి చెందిన రాష్ట్ర కూటులు ప్రసిద్ధులు. సూర్యవంశ రాఠౌడ్ లు తాము శ్రీరాముని పుత్రుడు కుశుని వంశానికి చెందిన వారమని చెప్తారు.మహారాష్ట్ర  కర్ణాటకలో సామంత ప్రభువులు. 
లక్ష్మణుడి పేరు మీద లక్ష్మణపురీ  క్రమంగా లక్నోగా మారింది. లక్ష్మ అంటే చిహ్నం అని అర్ధం. తేజస్సు శుభలక్షణాలు ఉన్న పురుషుడు  లక్ష్మణుడు!
మహారాష్ట్ర కి చెందిన లాటూర్ అనే ప్రాంతం పేరు లట్టలూర్ క్రమంగా లాటూర్ లాతూర్ ఐంది. ఇది జమీందారీ సంస్థానం 🌹

కామెంట్‌లు