జూన్,19 ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందిస్తూ
=================================
1.నాన్న వాక్కు నేర్పు,
సాధించాలి!
నాన్న వాక్కు తూర్పు,
చూడాలి!
నాన్న వాక్కు మార్పు,
అలవడాలి!
నాన్న వాక్కు కూర్పు,
ఏర్పరచాలి!
2. నాన్న మాట బాట,
పయనించాలి!
నాన్న మాట తోట,
విహరించాలి!
నాన్న మాట ఊట,
దాహం తీరాలి!
నాన్న మాట కోట,
నివసించాలి!
3.నాన్న మాట ఆనతి,
పాటించాలి!
నాన్న మాట సుగతి,
తరించాలి!
నాన్న మాట సుమతి,
ఆచరించాలి!
నాన్న మాట శాంతి,
అనుభవించాలి!
________
నాన్న మాట!;-డా. పి. వి. ఎల్. సుబ్బారావు.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి