నిక్కమైన మంచి నీలం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి
 బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అతని భవిష్యత్తు గొప్పగా ఉండాలని మంచి చదువులు చదివి మంచి ఉద్యోగం చేయాలని కోరుకోవడం సహజం. మట్టిబుర్రతో ఉన్నవాళ్లు ఏం చదివి ఏం లాభం. తెలివైనవాడు గురువు చెప్పిన పాఠాన్ని విని జ్ఞాపకం ఉంచుకొని  దానిపై సాధన చేసి మరింత చదువు చదవాలన్న కుతూహలంతో ఉంటాడు.  ఒక విషయాన్ని గురించి పరిశోధన చేస్తే  అతనికి తృప్తి ఉండదు మరొకటి, మరొకటి చేయాలనుకుంటాడు. అపారమైన చదువుకు అంతం ఎక్కడ. స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఆభరణాల మీద మోజు కలిగినవారు  నకిలీ వస్తువులను కోరక నూటికి నూరుపాళ్ళు నిక్కమైన వస్తువులే  కావాలనుకుంటారు.  దానిలో పాండిత్యం ఉన్న వాళ్ళు నీలాన్ని కోరుకుంటారు  నీలం నలుపుకు దగ్గరగా ఉంటుంది అంటే చీకటి  ఎప్పుడు చీకట్లో కూర్చుంటామో అప్పుడు వెలుగు కోసం ఆరాటపడుతోంది మనసు. దాని కోసం ప్రయత్నం చేస్తాం  ఆ జ్యోతిని చూసి తృప్తి పడతాము. ఏదైనా పద్యం చదవాలనిపిస్తే రసాత్మకమైన, భావాత్మకమైన రచనలని కోరుకుంటాము. పనికి రాని పద్యాలు ఎన్ని చదివిన  అవి దేనికీ పనికి రావు. అలాగే  మెరిసేదంతా బంగారం కాదని పెద్దల ఉవాచ. మెరుపు నగలు కోరకూడదు. నీవు ఒక మంచి వస్తువుని కోరుకోవాలని అనుకుంటే మంచి నీలాన్ని కోరుకో  అంతేగాని చౌకగా ఉన్నాయని  బుట్ట నిండా తీసుకురావద్దు. నీలానికి అధిష్టాన దేవత శని. ఇది పడితే ఏడు సంవత్సరాలు దాని ప్రభావం ఉంటుంది. అది వచ్చినప్పుడు మన పరిస్థితి తక్కువగా ఉంటే వెళ్లేటప్పుడు  శుభాలు కలగచేసి వెళతుంది. తాను వచ్చినప్పుడు  మంచి స్థితిలో ఉంటే దానిని తీసుకొని వెళ్ళిపోతుంది వేమన చెప్పిన పద్యం
"నిక్కమైన  మంచి నీలమొక్కటి చాలు 
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల 
చాటు పద్యమిలను  జలదా యొక్కటి..."

.

కామెంట్‌లు