అక్క ..తమ్ముడు ...!!-----డా.కె.ఎల్.వి.ప్రసాద్.-- సికింద్రబాద్ (హన్మకొండ )
 తమ్ముడి సంరక్షణకు 
అక్క అప్పుడే ఆరాటం ,
వడిలో చేర్చుకుని ...
జోకొడుతున్న సుసందర్భం !
ఒకరోజు వయసు 
ఆ..తమ్ముడిది ...
అయిదేళ్ల ఆరునెలలు 
ఈ అక్కవయస్సు ...!
తమ్ముడి పెంపకంలో 
తనవంతు సహకారాన్ని 
తల్లికి హామీ ఇస్తున్న భావన 
ఈ దృశ్యం చూస్తుంటే 
ఎవరికయినా కలుగుతుంది !
చిన్నారులు ఇద్దరికీ 
శుభాశీస్సులు .....!
వారిని కన్న తల్లిదండ్రులు 
ఎంత అదృష్టవంతులు ?
ఇదిచూసే భాగ్యం 
తాతకు -అమ్మమ్మకి కలగడం 
దేవుడిచ్చిన వరం ......!!
                      ***
ఫోటోలో...
తమ్ముడు తో అక్క...ఆన్షి.నల్లి 
సఫిల్ గూడ, సికింద్రాబాద్. 

కామెంట్‌లు