ఔ మల్ల!-- బాలవర్ధిరాజు మల్లారం
ముప్పై రెండేళ్ళ కిందట
మా ఊరి నుంచి
ఒక పిలగాడు 
జేబుల ఒక పోంటీను ,
కొన్ని పైసలు వెట్టుకొని
రెండు మూడు అంగీలు,పైంట్లు లుంగి,తువ్వాలను
సంచిల సదురుకొని ,
ఓ 15 కిలల బియ్యం,
కొంచెం పప్పు ముల్లె కట్టుకొని
ఎములాడకచ్చి 
పట్నం బస్సు ఎక్కిండు.
గా పట్నంల ఒక్క సుట్టపోల్లు
తప్ప ఇంకెవ్వల్లు ఎరుక లేదు
మాట గుడ సరిగ్గ రాదు
ఎనుకా, ముందు దీము లేదు
ఒక్క పొంటీనును నమ్ముకొని
పట్నం జేరిండు.
మరి  పట్నంల గా పిలగాడు
ఏమైండో రేపు సెప్పుతా!

ఏమి తెల్వనోడు
పల్లె నుంచి పట్నమచ్చి
పట్నంల ఏగుడు
లచ్చల మందిల  నెగులుడు
ఉత్త ముచ్చట కాదుల్లా!
ఔ మల్ల!


కామెంట్‌లు