సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
  తడిచే వారు... తుడిచే వారు
   *******
 మన జీవితంలో ఎందరో వ్యక్తులు తారసపడుతుంటారు.
 వారిలో అత్యంత సున్నితమైన, స్వచ్ఛమైన మనస్కులూ ఉంటారు, దేన్నైనా తేలిగ్గా తీసుకునే వారూ ఉంటారు.
వీరిలో సున్నిత మనస్కులున్నారే వాళ్ళను,మనసు కష్టపెట్టేలా ఎవరైనా ఓ మాట అన్నారంటే చాలు.ఇక వారు కన్నీళ్ళతో తడిచి ముద్దవడమే.
ఎవరి జోలికి పోని తమను ఎందుకలా అన్నారని విపరీతంగా మధనపడుతూ ఉంటారు.
ఇలా..ఏ చిన్న సంఘటన జరిగినా తట్టుకోలేని వారి,ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తూ, కన్నీళ్ళ పర్యంతం అయ్యే వారి మనసును అర్థం చేసుకొని మసలుకోవాలి.
అలాంటి వారి పట్ల సన్నిహితులైన మనం ఎంతో మృదువుగా ప్రవర్తించాలి.,మనసు కష్టపెట్టకుండా వారి కన్నీళ్ళు తుడిచి, మానసికంగా దృఢంగా తయారయ్యేలా చెయ్యాల్సిన, చూడాల్సిన బాధ్యత మనదే.
ఎదుటి వారిని కన్నీళ్ళతో తడిచేలా  చేయడం కాదు అలాంటి వారి కన్నీళ్ళు తుడిచే వారుగా ఉండాలి మనమెప్పుడూ.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు