నీదైనా...నాదైనా..
******
నీదైనా... నాదైనా నడిచే జీవితమనే దారి ఒకటే.
కానీ చేరాలనుకున్న గమ్యాలూ,నిర్దేశించుకున్న లక్ష్యాలూ,చెయ్యాలనుకున్న పనులే వేరు వేరు. బతుకు దారిలో మైలు రాళ్ళలా నలుగురికి దిశానిర్దేశం చేయగలుగుతాయి.
వెళ్ళే దారిలో ముళ్ళను ఏరుకుని పూలను పరుస్తూ వెనుక వచ్చే వారి నడకను సుగమం చేస్తారొకరు.
నాకేంటిలే ఎవడి బాధ వాడిదని తప్పుకు పోయే వారు కొందరు.
అనుసరించే పాదాలకు అవరోధాల ముళ్ళు విసిరి కసిగా సాగి పోయేవారు మరి కొందరు.
బతుకు దారిలో మైలు రాళ్ళలా నలుగురికి దిశానిర్దేశం చేసే చేయగలిగిన వారే స్మరణీయులు.
అలాంటి వారిని తలుస్తూ, ప్రశంసిస్తూ ఇచ్చే దీవెనలే...నీకైనా,నాకైనా మానసిక సంతృప్తిని,మరో మంచి పనికి సంకల్ప బలాన్ని ఇవ్వగలవు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి