వందనాలు పుడమి తల్లికి
హరి చందనాలు అడవి మల్లికి
వందనాలు కల్పవల్లికి
అభివందనాలు అమృతవల్లికి
చరణం:1
అందాల ఈ అవనీ
సుమగంధాల ఈ జననీ
ఆహ్లాదాల ఆ ఆమనీ
ఆనందాల ఈ యామినీ
చరణం:2
పచ్చనితరుల ఈ ధరణిని
స్వచ్ఛతెమ్మెరల ఈ ధాత్రిని
సహజవనరుల ఈ నేలని
పాడిపంటల ఈ పృథ్విని
చరణం:3
జీవ జలముల పుణ్య భూమిని
జంతు జాలముల ధన్య భువిని
ఘనచరితల హిమాచలాన్ని
అద్భుతాల నీలాకాశాన్ని
చరణం:4
చేయకోయి వినాశనాన్ని
చేయవోయి వికాసాన్ని
కోర కోయి విధ్వంసాన్ని
కోరవోయి విశ్వహితాన్ని
కాపాడుకోవాలి పర్యావరణాన్ని
కాపాడుకోవాలి పర్యావరణాన్ని
( 05.06.2022 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా)
గుండాల నరేంద్రబాబు
అసోసియేట్ ఎన్.సి.సి.ఆఫీసర్
10 ఆంధ్ర నావికా దళ విభాగం
ఎన్.సి.సి నెల్లూరు.
తేది:04-06-2022
సెల్: 9493235992.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి