సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
చులకన... హేళన...
  ******
చులకన..హేళన..ఈ రెండు పదాలు దాదాపుగా ఒకేలా అనిపించినా ఇతరులను తక్కువ చేసి చూడటం చులకన భావం అనీ, ఇతరులను పరోక్షంగా విమర్శించడం, ఆకారాన్ని అస్తిత్వాన్ని వెక్కిరించడం హేళన కిందికి వస్తాయి.
 తమకు ఉన్న అందం కానీ, ఆస్తి, అంతస్తు, సమాజంలో పరపతి లాంటివి కానీ  చూసుకుని మురిసిపోతూ....తమ ముందు  దేనికీ సరితూగరనీ, ఎందుకూ పనికి రాని వారనే అహంతో ఇతరులను తక్కువ చేసి చూస్తుంటారు.
అలా చులకన చేయడం వల్ల ఎదుటి వ్యక్తి ఎంత గాయపడతాడో.. తమ దాకా వచ్చాక కానీ తెలియదు.
 ఇక కొందరైతే... ఇతరుల ఆకారాన్ని, స్థితి గతులను,  వారు చేసే పనులను ప్రవర్తనను కావాలనే కించపరుస్తూ, వెక్కిరింపుగా మాట్లాడుతూ ఉంటారు.అలాంటి  మనస్తత్వం కౄరత్వానికి పరాకాష్ఠ.
 ఏది ఎంత ఉన్నది అనేది ముఖ్యం కాదు.' ఎవరూ తక్కువ కాదు.ఎవరి విలువ వారికి ఉంటుందనేది గమనంలో పెట్టుకుని ప్రవర్తించడం... ఆయా వ్యక్తుల యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు