రక్షో రక్షతి @కోరాడ నరసింహా రావు !

 పచ్చని చెట్టు తోనే.... 
...ప్రకృతిసోయగానికి పరిపుష్టి 
చెట్టులేనిదే  నీరు రాదు... 
 నీరులేనిదే ప్రాణికోటి మనుగడ
లేదు !!
చెట్టందించే  ప్రాణ వాయువు కొర వడి...మనిషి సృష్టిస్తున్న విషవాయువులు ప్రబలి......
ఆకాశపు రక్షణ కవచం చిల్లులు పడి,భూగోళం అగ్ని గుండమై...
 నశిస్తుంది జీవకోటి !!
      మన మనుగడ సాగాలంటే
నింగిని, నీటిని, గాలిని, నేలను 
కాపాడుకుంటేనే...అగ్నిఅదుపు లో ఉంటుంది...!
   మనఒళ్ళు, ఇల్లే కాదు....పరి సరాలూ శుభ్రతతో భద్రం గాఉం చాలి  !
      చెట్లను నరకటం కాదు...... 
మొక్కలను నాటాలి !
    సుఖాలను నియంత్రించి...... 
యంత్ర  కాలుష్యము  నిరోధిం చాలి.... !
  పర్యా వరణ పరిరక్షణే  మన రక్షణకవచము...నిర్లక్ష్యము చేసామంటే మనకు మనుగడ సూన్యము.... !!
.   *******
కామెంట్‌లు