చిట్టి పొట్టి పిల్లల్లారా
చిన్నారి పాపల్లారా
బావి భారత పౌరుల్లారా
భారతమాత బిడ్డల్లారా
పట్ఠు మీరు పట్టండి
పిడికిలి గట్టిగ పట్టండి
కట్టు మీరు కట్టండి
నడుము బిగించి కట్టండి
అడుగు ముందుకేయండి
ఊరు పొలిమేర దాటండి
దేశ సరిహద్దుకు చేరండి
నాలుగు దిక్కుల నిలవండి
మంచుకొండల్లోకి చేరండి
రక్షణ వలయంగా ఉండండి
దేశానికి రక్షకులుగా మారండి
మీరే రేపటి దేశ రక్షకులండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి