మా బడి-దైవ గుడి;---గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.
అందమైన మా బడి
అది మాకు దైవ గుడి
అక్షరాల నారు మడి
అందించును నడవడి

పోగొట్టును అలజడి
సరికొత్త ఒరవడి
సర్కారు మా బడి
మెత్తని అమ్మ ఒడి

రారండి త్వరపడి
చేయండి సందడి
వినోదాల సవ్వడి
వికాసాల మా బడి

అద్భుతాల మా బడి
గురువుల ఏలుబడి
దివ్యమైన నానుడి
తుడుచునోయ్! కంటతడి

విజ్ఞాన రాబడి
బడి మాకు పెట్టుబడి
ఉంటాం కట్టుబడి
ఎదుగుతాం కష్టపడి

అజ్ఞాన చేతబడి
తరుముతాం నిలబడి
విప్పుతాం చిక్కుముడి
చదువుతాం వెంటపడి


కామెంట్‌లు