నాన్న!!--ప్రతాప్ కౌటిళ్యా
రాత్రి పగలు
నిరంతరం శ్రమించే
శ్రామికుడు గుండె
వాడే మా నాన్న!!

మెలుకువలో నిదురలో
మేల్కొని నన్ను నిద్ర పుచ్చి
తను మేల్కొనే
నిఘా కాపలాదారు మెదడు
వాడే మా నాన్న!!?

రక్తాన్ని వ్యర్థాల్ని వేరు చేసి
మంచి నిచ్చి
చెడును విసర్జించీ
మమ్మల్ని బ్రతికించేవాడు కిడ్నీ
వాడే మా నాన్న!!?

తను ఆకలిగొని
మా కడుపు నింపి
తన కడుపు మార్చుకునే
జీర్ణాశయం మా నాన్న!!?

విషాన్ని పీల్చుకుని
కల్తీ లేని సేవచేసే కాలేయం
మా నాన్న!!

ఎన్నో అవమానాల్ని ఎదుర్కొని
మా మానాల్నీ కాపాడేందుకు
మా శరీర అవయవంగా
మారిన వాడు మా నాన్న!!

ఫాదర్స్ డే ను పురస్కరించుకొని
 Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏

కామెంట్‌లు