గెలుపొందిన నానీలు
================
1)
నిత్యం నష్టపోతున్న
రైతన్న
కష్టంలో కళ్ళొత్తుతుంది
తువ్వాలు బంధమై !
2)
వ్యతిరేకంగా
ఉంది కోడలు
వాత్సల్య బంధoతో గెలిచింది
అత్తగారు !
3)
ఒంటరి తనం
సునామీలా ముంచింది
కవిత్వం బంధంతో
ఒడ్డున పడ్డాను !
4)
అనివార్యమైన
సూర్య చంద్రుల బంధం
అశేష ప్రాణుల
జీవసౌధం !
5)
వ్యసనాన్ని
బంధం అనుకోకు
జీవితం పగ్గాలు
చేజారిపోతాయి !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి