ఆంధ్రుల ఆరాధ్య దైవం;-డా.. కందేపి రాణీప్రసాద్.
మహిళలకు ఆస్తి హక్కు కల్పించి
ఆడపిల్లను అగ్రభాగాన నిలబెట్టి
ఆర్థిక సమానత్వంతో విశ్వసాన్నిచ్చి
ఆభద్రతా భావాల స్త్రీలకు ‘అన్నగారు’

తెలుగు భాషకు ఆత్మగౌరవాన్ని కట్టబెట్టి
తెలుగు దనాన్ని వేష భాషల్లో చొప్పించి
తెలుగును స్వచ్చంగా ఉచ్చరించే నేర్పుతో
ఆంధ్రులకు దొరికిన ఏకైక “తెలుగువాడు”

ముత్యాల చేతిరాత ముఖమేమో చందమామ
చిత్రలేఖనా చిత్రాలు వందల నటనా చిత్రాలు
చక్కని ఆహార్యం సినీ చిక్కని అభినయాలతో
‘విశ్వ విఖ్యాత సినీ నట సార్వభౌముడు’

రంగుల మాయా ప్రపంచంలో నిజాయితీతో
రాముడు కృష్ణుడు గా ప్రజల మనసుల్లో దూర
నట వినీలాకాశంలో శిఖరమంత ఎదిగి
ఆంధ్రుల ఆరాధ్య దైవమైన ‘కళాకారుడు’

గ్లామర్ తో స్పిచులతో ఆంధ్రుల మెప్పించి
పార్టి పెట్టిన తొమ్మిది నెలల్లోనే గెలిచి
తెలుగోడి కీర్తిని ప్రపంచ వ్యాప్తి గావించి
నిష్కల్మష రాజకీయ నేత ‘ఆంధ్ర ముఖ్యమంత్రి’

రెండు రూపాయలకు బియ్యమిచ్చి ఆకలిదీర్చి
తెలుగు గంగా నీళ్ళను పంటలకు పారించి
క్రమశిక్షణతో ‘తెలుగు దేశాన్ని’ నడిపించి
సంస్కరణలెన్నో చేసినా ‘జన నాయకుడు’ 

కామెంట్‌లు