సమ్మోహనాలు (687-94)
===============
వాలుకుర్చీ చూడు
చూడ ఠీవిగ నేడు
నేటికీ రాజసం వొలికేను ఓ వనజ !
,విశ్రాంతి సాధనము
సాధనకిది మూలము
మూలమై వ్రాతలకు అనుకూలమే వనజ !
ఇంటి యజమాని కిది
ఇది హోద నిచ్చింది
హోదాకు తగినట్టు కచేరీ ఓ వనజ !
చేతులకాధారము
ఆధార శోభితము
శోభితము ఆలోచనలు కూడునో వనజ !
ముందున్న చినబల్ల
బల్లపై లెక్కల్ల
లెక్కలను వేయుదురు నిమ్మళంగా వనజ !
దర్జాకి ఒక రూపు
రూపుల సోకు చూపు
చూపుతూ ఒక పలకరింపగును ఓ వనజ !
నిద్రకిది వీలగును
వీలు చిరు కునుకగును
కునుకుతీసిన తృప్తి కలుగునే ఓ వనజ !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి