అసహాయత నుండి
ఆత్మ స్థైర్యం వైపు అడుగు
అసమానత నుండి
సమానత్వ హక్కు కై అడుగు!
అధికారం లభిస్తే
అవమానం తొంగి చూడదు
ఆయుధం చేస్తికోస్తే
అపహాస్యం చెంత చేరదు !
కంచే చేను మేస్తే
చేనే కంచెగా మారి పోరాడాలి
భర్తే నేరం చేస్తే
స్త్రీ యే పోలీస్ గా మారి శిక్షించాలి
బస్టాపుల్లో నిలబడే
మహిళలతో అసభ్యంగా పోకిరీలు
కాలేజీలకు వెళ్లే
విద్యార్థినులు విధించే కుర్రాళ్ళు
పనులు చేసే చోట
విషపు చూపులతో మగాళ్లు
విషమ పరిస్థితుల్లో అబలలు
క్లిష్ట సంకటాలలో కాంతలు!
నిస్సహాయులకు అడబిడ్డలకు
అండదండగా స్త్రీ పోలీస్!
ఆకతాయిలకూ ,తుంటరులకూ
సింహస్వప్నగా స్త్రీ పోలీస్!
అతివలకు భద్రతనిచ్చే స్త్రీ పోలీస్
మగువలకు భరోసానిచ్చే స్త్రీ పోలీస్
పడతులకు ధైర్యనిచ్చే స్త్రీ పోలీస్
వనితలకు నిబ్బరానిచ్చే స్త్రీ పోలీస్
స్త్రీ పోలీస్ గా మారితే
ప్రతి పధం ఒక సాహస కృత్యం
స్త్రీ పోలీస్ గా చేరితే
ప్రగతి రధం పదిల ప్రయాణం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి