ధనం... గుణం...
******
ధనం ఉన్న వాళ్ళు, లేని వారు మన చుట్టూ ఎందరో కనిపిస్తూ ఉంటారు.
కొందరు పిల్లికి కూడా బిచ్చమెయ్యని పిసినారులను, ఎంగిలి చేతిని కాకులకు విసరని లోభత్వం కలవారిని చూస్తూ ఉంటాం.
అలాంటి వారి దగ్గర ఎంత ధనం ఉన్న వాళ్ళకు తప్ప ఇతరులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.
సముద్రంలో నీళ్ళు ఎన్నున్నా సాటి వారి దాహం తీర్చలేవు కదా.
తమ దగ్గర ధనం లేకున్నా కొందరికి సాటి మనిషికి సాయపడే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది.
నీటి చెలమ లాంటిది వాళ్ళ గుణం. పెద్ద ఎత్తున ఉపయోగపడక పోయినా కొంతైనా అవసరాన్ని తీరుస్తుంది.
అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు 'ధనం ఎంతున్నదని కాదు సాటి వారికి సాయం చేసే గుణం ఉందా లేదా అన్నది ముఖ్యం.
ఉన్నంతలో నలుగురికి సహాయపడుతూ జీవితాన్ని సార్థకం చేసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి