జాంపండు (బాలగేయం);- డా.గౌరవరాజు సతీష్ కుమార్
 చిలుక కొరికిన పండు
తీయనైన జాంపండు
బుట్టలో దాచి ఉంచాను
పాపాయి కివ్వరా రాంపండూ
బుట్టలోనీ పండు మాయమయ్యిందీ 
ఎలుక తీసేనేమొ నాకు తెలియాదు 
పండు తీసీ ఎలుక ఏడ పెట్టిందీ 
తోటలో ఎక్కడో దాచి పెట్టిందీ 
వెంటనే పిల్లి చిందులేసిందీ 
రారమ్మనీ పిల్లి నన్ను పిలిచిందీ 
పిల్లి జాడను చూసి ఎలుక 
పరుగోపరుగు మల్లె పందిరి కింద జామపండుందీ
పోయినా పండేమొ మళ్ళి దొరికిందీ
చిలుక కొరికిన పండు 
తీయ జాంపండూ
పాపాయి కివ్వరా రాంపండూ!!

కామెంట్‌లు