పల్లవి:
మల్లె కన్న తెల్లనైన
మంచు కన్న చల్లనైన
మనసున్న ఓ నాన్న
మమతున్న ఓ నాన్న
వెన్నెలoత హాయియైన
వెన్న కన్న మెత్తనైన
మది వున్న ఓ నాన్న
హృది ఉన్న ఓ నాన్న
చరణం:1
కష్టాన్నే నమ్ముకున్న కర్మజీవే నాన్న
ఇష్టాల్నే నెరవేర్చే ధన్యజీవే నాన్న
లోకాన్నే చూపే మార్గ దర్శ నాన్న
శోకాన్నే మాపేటి బుద్ధుడే నాన్న
చరణం:2
కరుగుతు వెలుగు పంచే దీపమే నాన్న
అరుగుతు గంధం పంచే రూపమే నాన్న
తరుగుతు వెన్నెల నిచ్చే త్యాగమే నాన్న
ఒరుగుతు ఓరిమి
నింపే ధైర్యమే నాన్న
చరణం:3
బ్రతుకంతా తోడుగ నిలిచేదే నాన్న
తప్పటడుగుల్లోన చేయూతే నాన్న
కష్టాల కడలిలోన దిక్సూచే నాన్న
నష్టాల దారుల్లో వెన్నుదన్నే నాన్న
చరణం:4
శిశిరoలోన ఆమని కోయిలే నాన్న
అమాసలోనా పున్నమి చంద్రుడే నాన్న
చెమట చుక్కల్లోన స్వర్గమే నాన్న
చెరకు గడలలోనా తియ్యదనమే నాన్న
గీత రచన:
గుండాల నరేంద్రబాబు
తెలుగు పరిశోధకులు
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
తేది:18-06-2022
సెల్: 9493235992.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి