చురకలు-చెమక్కులు!;-- సేకరణ ; అచ్యుతుని రాజ్యశ్రీ
 నానాఫాల్కీవాలా దేశబడ్జెట్ పై సునిశిత వ్యాఖ్యలు చేసేవాడు. 1971-72బడ్జెట్ ని ఇలా  దుయ్యబట్టారు " అమీరీ హటావో అంటారు. కానీ ఎన్నికలప్పుడు మాత్రం  గరీబీహటావో నినాదాలహోరుతో ఓట్లు అడుక్కుని అందలాలు ఎక్కుతారు."మరి ఆయనమాట ఇప్పటికీ నిత్యసత్యం!
నెహ్రూ మంత్రి వర్గం లో పనిచేసిన కృష్ణమీనన్ ని  స్టామ్వెల్ ఇంటర్వ్యూ చేస్తూ ఎంత వ్యంగ్యంగా అన్నాడో చూడండి " మిష్టర్ మీనన్!నీవు గర్భదరిద్రంలో పుట్టి పెరిగావు.ఓ ఆంగ్ల మహిళ నిన్ను చేరదీసి లండన్ పంపింది. అక్కడ లా చదివి  నెహ్రూ కృపా కటాక్షం తో మంత్రి వి అయ్యావు.మట్టి లో పుట్టి మింటి కెగురుతూ పైపైకి సాగుతున్నావు." మీనన్ ఎదురు దాడిచేశాడు" థాంక్స్ స్టాంవెల్! నన్ను బ్రహ్మాండంగా పొగిడి ములగచెట్టు ఎక్కించావు.మరి నీవు ఓఅక్రమసంతానంట కదా?నాన్న ఎవరో తెలీని అమ్మకు పుట్టావు.పోనీలే!కనీసం  అమ్మ మొహం తెలుసు నీకు! అలాంటి నీవు  ఇలాంటి స్థాయికి ఎదిగి అందరినీ సూటిపోటిగా పొడిచే గురువింద గింజా!" అంతే!స్టాంవెల్ స్టన్ అయ్యాడు!
ఓసారి పండిట్ మోతీలాల్ నెహ్రూ కి బాగా జలుబు చేసింది.ఖద్దరు దస్తీ తో ముక్కు  తుడిచి తుడిచీ బాగా ఎర్రబడింది."ఏంటీ!జలుబు చేసిందా?"ఎవరో పరామర్శిస్తే"ఇంకొన్నాళ్లు మాత్రమే  నాకు ముక్కు ఉంటుంది. నాగెస్ట్ గా! గాంధీ ఖద్దరు దస్తీ తో ఇలా రోజు నేను ముక్కు రుద్దితే అది మాయం అవటం ఖాయం!నాకు ముక్కు కి దస్తీ కి రామ్ రామ్!"
ఆరోజుల్లో ఉప్పు సత్యాగ్రహం జరుగుతోంది. కొడుకు ని అరెస్టు చేశారు అన్న వార్త తెలిసి మోతీలాల్ ఉప్పు వండుతున్న చోటుకి వచ్చి పొయ్యి లో ఓకట్టె విసిరాడు. "నన్ను కూడా జైల్లో పెట్టండి"అని అలహాబాద్ సభలో సవాల్ విసిరాడు.అంతే ఆయన్ని అరెస్టు చేశారు. 
ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంని నిగ్గదీసి వారి పీచం అణిచిన గొప్ప వక్త  స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ సత్యమూర్తి! బ్రిటిష్ ఆర్ధిక మంత్రి జేమ్స్ గ్రిగ్ ని ఢీకొన్న ఏకైక ధీరుడు!!"కాస్త  బీదాబిక్కీ ని చూసి ఆదుకో"అన్నాడు. గ్రిగ్ వెంటనే " ఈకటునిజంని నీవు  ఎదుర్కోవాలి"అన్నాడు.అంతే సత్యమూర్తి గారి రామబాణంఇది" రోజూ నీఎదురుగానే కూచుంటున్నాగా?నిన్ను ఎదురు కుంటున్నాగా?ఇది కటునిజంకాదా?" పాపం గ్రిగ్ ఉక్కిరిబిక్కిరి తో చిత్తయి నిరత్తరుడై కూలబడ్ఠాడు.🌹

కామెంట్‌లు