సూరీడు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 సూరీడమ్మా సూరీడు
తూరుపు దిక్కున లేస్తాడు 
పడమర దిక్కున మునుగుతాడు
 చలికాలంలో వెచ్చని సూరీడు 
మంచు కొండ కరిగించే సూరీడు 
నీటిని ఆవిరి చేసే సూరీడు 
నవగ్రహాల జీవం సూరీడు
కాలము మూలం సూరీడు
రుతువుల మూలం సూరీడు 
ఆహారం ఆరోగ్యాల మూలం సూరీడు
ప్రాణికోటికి ఆధారం సూరీడు !!

కామెంట్‌లు