సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
  చాలనకు... మేలనకు...
*****
ఈ విశ్వం, ప్రపంచం,ఈ ప్రకృతి అనంత విజ్ఞాన భాండాగారం.కనిపించే సాగరం. తెలియని విషయాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.
 పరిశోధనకు అందని,పరిశీలనకు పట్టుపడని, అంతుపట్టని రహస్యాలు  ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.
ఎంత నేర్చుకున్నా తరగని నిధి.
జీవితాంతం కృషిచేసినా ఏ ఒక్క విషయం లోనూ పరిపూర్ణతను పొందలేం.
 శ్రీ శ్రీ గారు అన్నట్టు...'సాధించిన దానికి సంతృప్తిని పొంది, అదే విజయం అనుకుంటే పొరపాటే' నని గ్రహించాలి.
అందుకే  ఇక చాలనకుండా  విద్యార్థిలా నిరంతరం జ్ఞాన సముపార్జనకు తపిస్తూ ఆ దిశగా పయనిస్తూ ఉండాలి.
ఏమీ తెలుసుకోకుండా,దేని మీద అవగాహన పెంచుకోకుండా,ఉన్న జ్ఞానంతో ఇలా ఉండటమే మేలనుకోవద్దు.
ఒకోసారి అలా నేర్చుకోక పోయినందుకు, తెలుసుకోలేక పోయినందుకు చింతించే పరిస్థితులు రావచ్చు.
 
తెలిసింది చాలు,ఇదే మేలని అనుకోకుండా, నేర్చుకోవడంలో ఆనందాన్ని, పెంచుకున్న జ్ఞానంతో రెట్టింపు ఉత్సాహాన్ని పొందుతూ ముందుకు సాగాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు