పల్లవి::
పచ్చని పందిరి వేసినట్టుగా
ముచ్చట గొలిపే మన బడి.
పచ్చని జీవిత రథమును నడిపే
చదువుల పెన్నిధి
మన బడి.
"పచ్చని"
చరణం:
చిన్నారుల మనసును
తెలిసి నడిచెడీ
గురువుల సన్నిధి మనబడి.
చిరునవ్వుల పిల్లల
జ్ఞానం పెంచే
చదువుల గుడి ఇది.
మన బడి.
"పచ్చని"
చరణం:
ఆట పాట మేటిగ సాగే
ఆనందాల సింగిడి
ఆకాశంలో మెరిసెడి తారక
వెలుగు రేఖలే మన బడి.
"పచ్చని"
చరణం::
తల్లిదండ్రుల ప్రేమ
రూపమై
పెరిగిన పిల్లల
సంక్షేమ సారథి
మనబడి.
విలువల విద్యతొ
ఎదిగెడి బాలల
భవితకు విరిసిన
విద్యాగంధపు సుమమిది.
"పచ్చని*

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి