మనం ఎంత గా అభివృద్ధి చెందుతున్నాకూడా గ్రామాల్లో పట్టణాల్లో కూడా దేవుని పేరు చెప్పి బురిడీకొట్టించే దొంగసాధు సన్యాసులు ఉన్నారు. చదువుకున్న వారు కూడా మోసపోతారు.డబ్బు మాన మర్యాదలు పోగొట్టుకుంటారు.సైన్స్ పై ఆధారపడి చేసే ట్రిక్కులు అవన్నీ!లత 7వక్లాస్ వరకు చదివింది. తండ్రి చనిపోటంతో కూలీ పనులు చేస్తూ బతుకు తున్నారు లత తల్లి ఆమె.14ఏళ్ళ లతకి సంబంధాలు వెతకసాగింది తల్లి! కానీ కుదరక పోటంతో దిగులు పడుతోంది. హఠాత్తుగా ఆపల్లెకి ఓదొంగసన్యాసి వచ్చాడు. ఆరావిచెట్టు కింద మకాం వేసి గట్టుపై అమ్మవారి విగ్రహం పెట్టి ధాంధూంగా పూజలు తాయెత్తులు విభూది ఇచ్చి రోగాలు తగ్గిస్తున్నాడు అని జనం చెప్పుకోసాగారు.లతని తీసుకుని తల్లి వెళ్లి కూతురి పెళ్ళి గూర్చి బాధపడ్తుంది. "నేను పెళ్ళి ఎప్పుడు అవుతుందో చెప్తాను"అన్నాడు."ఈకొబ్బరికాయను రాత్రి లత తలదగ్గరపెట్టి రేపు దీనితో పాటు నీ బిడ్డను తీసుకుని రా!"ఆ మర్నాడు లత అమ్మ తో సాధువు దగ్గరకు వెళ్లింది.సాధువు లత ఒళ్ళో కొబ్బరికాయను పెట్టి అమ్మవారి విగ్రహం చూస్తూ కూచోమన్నాడు.కాసేపైనాక అందరూ చూస్తూ ఉండగా ఆమె చేతిలోని కొబ్బరి కాయను పగల గొట్టాడు.అది భళ్ళున పగలగానే కుళ్ళు పేడ కంపు కొట్టడమే గాక లోపలంతా పురుగులతో లుకలుకలాడుతున్న పేడ కన్పడింది.
"నీవు మహా దురదృష్టవంతురాలివి!"అంటూ హ్రాం హ్రూం అని రంకెలు వేస్తూ ఆమెపై నీరు చిలకరించాడు.ఆనీటితో ముక్కు కొననుంచి పాపిడిదాకా నిలువుగీత గీశాడు.ఆపై అమ్మవారి పాదాలముందున్న చెక్కపీటపై చాకుతో గుండ్రంగా చాలా సార్లు గీశాడు. "లతా!ఇక్కడ నీముక్కు రుద్దు" అనగానే ఆమెదాదాపు 30సార్లు రుద్దింది.ఆశ్చర్యం!! దానిపై "ర" అనే అక్షరం కనపడింది. "భాగ్య శాలివి! నీకు ఆపేరున్న వాడు రెండు వారాల్లో భర్తగా లభిస్తాడు.ఈకొబ్బరికాయను తీసుకుని వెళ్లు.తలదగ్గరపెట్టి పడుకో! రేపు నేను మీఇంటికి వస్తాను." అని పంపాడు. ఆమర్నాడు లత ఇంట్లో ఆమెచేత పూజ చేయించి ఓవంద రూపాయలు దక్షిణ తీసుకున్నాడు.కొబ్బరికాయ కొట్టించాడు.ఆశ్చర్యం!ఘుమఘుమ కమ్మని పరిమళాల నీరు! సరిగ్గా 15రోజుల తర్వాత రాకేష్ అనే కుర్రాడు పెళ్లి చూపులకు రావటం దూరపు బంధువు తాత సాయంతో లత తల్లి ఆమె పెళ్లి చేయించటం చకచకా జరిగాయి."ఓచిన్న గుడిలో చేయించాడు తాంత్రికుడు డబ్బు ఖర్చు వద్దు అంటూ!వెంటనే లతను అత్తారింటికి తీసుకుని పోయాడు వరుడు.వరునితో అతని అమ్మా నాన్న లు తప్ప ఎవరూలేరు పెళ్ళిలో!లత పొరుగింటివారు ఇద్దరు తప్ప ఎవరినీ పిలవలేదు సాధువు ఆదేశంపై!15రోజులు గడిచినా లత దగ్గరనించి ఏకబురు కాకరకాయ రాకపోవడం తో లత తాతని తోడుతీసుకుని ఆపట్టణం వెళ్లింది.ఆఇచ్చిన అడ్రసు తప్పుది.అన్నిచోట్ల గాలించి పోలీసు రిపోర్ట్ ఇవ్వడం పెళ్ళి ఫోటోలు చూపటంతో పోలీసుల రంగప్రవేశం జరిగింది. ఆవరుడు సాధువు బద్మాష్ ముఠాగాళ్లు.పెళ్లి పేరుతో ఎంతో మంది ఆడపిల్లల గొంతు కోసి బొంబాయి రెడ్ లైట్ ఏరియా అరబ్ షేక్ లకు అమ్మేస్తారు. సాధుతాంత్రికుడి కొడుకు రాజేష్! ఇంకేముంది?ఆముఠాని పోలీసులు జైల్లో పారేశారు. ఆదొంగసన్యాసి అమ్మవారి పేరు తో చేసింది అంతా సైన్స్ ప్రయోగాల పై ఆధారపడినవే!
కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కదా!? ఒక కన్నుకి రంధ్రం చేసి దాని నిండా పేడ నింపాడు. ఆపై కన్పడకుండా రం గు పూసి పసుపు కుంకంతో కొబ్బరికాయను అలంకరించాడు.ఫేరిక్ క్లోరైడ్ తో సోడియం ధయో సైనేట్ కలిపాడు.పీటపై "ర"అనే అక్షరం కనపటంకి కారణం ఆరెండింటి రసాయనిక చర్య! లత ముక్కు నించి పాపిట దాకా పెట్టిన బొట్టు చెక్కపీటపై 30సార్లు లత ముక్కు రుద్దడం వల్ల రసాయనిక ప్రక్రియ జరిగి ఎర్రరంగులో ర అనే అక్షరం కనపడింది. ఇక రెండోసారి కొబ్బరికాయలోకి అత్తరు పంపాడు కాయ ఓబెజ్జంలోంచి! అందుకే కమ్మని పరిమళాల వాసన లత ఇంట్లో కొట్టిన కొబ్బరికాయలోంచి వచ్చింది. అందుకే సాధుదొంగ సన్యాసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి నిజ సంఘటనల ద్వారా అందరం తెలుసుకుని తీరాలి🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి