ఆమె;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 అందము ఆమె...
ఆనందము ఆమె...
అడుగడుగున ఆమె...
అనంతము ఆమె...
ఆది ఆమె...
అంతము ఆమె...
అలాంటి,
ఆమెను అమ్మలా సేవించండి....
ఆమెకు ఆసరా అందించండి....
ఆమెను ఆప్యాయంగా ఆదరించండి...
ఆమె ఎడతెగని త్యాగాలను గౌరవించండి....
ఆమె ఆశయాలకు చేయూత అందించండి....
ఆమెకు కలలుకనే స్వేచ్చను కల్పించండి....
ఆమెను వెన్నుతట్టి గమ్యం దిశగా నడిపించండి....
ఆమె భద్రత, అందరి బాధ్యతగా భావించండి.....
ఆమెతో అంతటా మమేకమై జీవించండి....
అంతే కానీ,
భారమైన మాటలతో ఆమెను భాధించకండి....
చేవలేని చేతులతో ఆమెను హింసించకండి....
పవిత్రమైన ప్రేమ పేరిట ఆమెను వంచించకండి....
ఆడ అంటూ, ఆమె పై వివక్షతను చూపించకండి....
లక్ష్యానికి అడ్డుపడుతూ, అనుక్షణం ఆమెను వేధించకండి....
కలత కలిగించి ఆమెతో కన్నీరు పెట్టించకండి....
బంగారు బొమ్మను భారమని భావించకండి....
గుమ్మం దాకా రానియ్యక గర్భంలోనే ఆమెను చంపేయకండి....కామెంట్‌లు