తెల్లకాగితం--కాగితం-కన్నెపిల్ల;- సత్యవాణి
 కన్నె పిల్ల మనసులా 
తెల్ల కాగితం
స్వఛ్ఛంగా వుంది
కన్నె పిల్ల హృదయంలా
కాగితం కంగారు పడుతోంది
కలవర పడు తోంది
ఎటువంటి వాడు వచ్చి
తనను చేపడతాడో అని
కన్నెపిల్ల కలవర పడుతూంది
ఎటువంటి భావనలతో కవిత
తన ఎదను ఆక్రమిస్తుందోనని
తెల్లకాగితం కలవర పడుతోంది
కన్నెపిల్ల ఆశ
తనకు కాబోయేవాడు
మల్లెపూవువంటి మనసుతో
స్వఛ్ఛతగా వుండాలని
తెల్ల కాగితం ఆశయం
కల్మషం లేని కవిత
కాపీ చేయబడని కవిత
తనపై అద్దబడాలని
వేల కనులు వెతికి వెతికి
తనపై అద్దబడిన కవిత
జనాన్ని చేరి అలరించాలని
తెల్లకాగితం కోరితే
మరక అంటని మగడు రావాలనీ
నిండు నూరేళ్ళూ
తమదాంపత్యము వర్థిల్లాలని
తమది ఆదర్శ దాంపత్యంగా
అవనిజనులు మెచ్చాలనీ 
కన్నెపిల్ల కోరిక
       

కామెంట్‌లు