"ప్రకృతి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు." ;----రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త.
 ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి జీవి తన బాధ్యత కూడా నిర్వర్తిస్తుంది.
"పేరుకు పేడ పురుగే కానీ బాధ్యతలో ఆదర్శం." ప్రేమ, ఆప్యాయత, సమయస్ఫూర్తి, అనుకువ, ఓపిక,  నేర్పరితనం, విజ్ఞానం, బాధ్యత, రానున్న ఆపదలను గ్రహించే శక్తి.
ఈరోజు సహజ ప్రకృతి లో జీవిస్తున్న టువంటి ఒక కీటకం అంటే "పేడ పురుగు" Phanaeus vindex (డంగ్ బీటిల్) గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను.
ఇది తను జీవిస్తూ పర్యావరణానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తుంది. ఉదాహరణకి ఫ్రెష్ గా ఉన్న పేడను తన ఆహారంగా ఉపయోగించుకోవడానికి గుండ్రటి ఉండగా మార్చుకొని రోల్ చేస్తూ తమ వెనుక కాళ్ళతో నెట్టుకుంటూ ఒక మెకానికల్ ఇంజనీర్ లాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి, ముందే చేసి పెట్టుకున్నటువంటి భూమి లోపలి బొరియలలో దాచుకుంటుంది సంవత్సరమంతా ఆహారంగా. పేడను ఈగలు వాలకుండా, రోగాలు రాకుండా భూమి లోపల దాచి పెట్టి దాన్ని ఆహారంగా స్వీకరించి నుండి సంక్లిష్ట పదార్థాన్ని సరళ పదార్థంగా మార్చి తిరిగి భూమి లోపల న్యూట్రియన్స్ ని రీసైకిల్ చేసి (బయో జియో కెమికల్ సైకిల్) భూమి యొక్క సారవంతం పెంచుతుంది. ఆ రకంగా ఇది ప్రకృతిలో తన జీవన చక్రంలో తన బాధ్యత నిర్వహిస్తూ దోహదపడుతుంది, మారుస్తూ బాధ్యతగా ఆదర్శ జీవిగా జీవిస్తుంది. 🪲
"బాధ్యత అనేది బతుకు చిత్రాన్నే కాక ఆదర్శ జీవిగా మార్చివేస్తుంది."


కామెంట్‌లు