బహుభాషా కవి కే పి విఠల్ గారికి ముత్యాల హార పురస్కారం

 రాష్ట్ర రాజధాని నగరానికి  చెందిన కే పి విఠల్ బహు భాషా కవి . 
  తెలుగు, హిందీ భాషల్లో   రచన రంగంలో రాణిస్తున్నారు.శ్రీమద్భగవద్గీత సహస్ర నామావళి పైన విఠల్ ముత్యాల హారాలు లిఖించినందుకు వీరికి ముత్యాల హార పురస్కారం వరించింది.బహుభాషల్లోనూ రాణిస్తున్న కవి విఠల్
తెలుగు భాష మీద ఆసక్తితో ముత్యాలహార ప్రక్రియలో శతకం  లిఖించారు. ఉట్నూర్ సాహితీ వేదిక చెందిన
కవి, రచయిత ఉపన్యాసకులు శ్రీ రాథోడ్ శ్రావణ్ రూపొందించిన ముత్యాలహారం నూతన లఘు  కవిత ప్రక్రియలో  శ్రీమద్భగవద్గీత సహస్ర నామావళి అంశాల పై శతక కవితలు అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన సందర్భంగా కాటేగారు పాండురంగ విఠల్
 కు ముత్యాలహార పురస్కారాన్ని ఇటివల వాట్సాప్ వేదికగా ఉట్నూర్ సాహితీ వేదిక అధ్యక్షులు కవన కోకిల జాదవ్ బంకట్ లాల్, ప్రధాన కార్యదర్శి ముంజం జ్ఞానేశ్వర్,  ప్రచార కార్యదర్శి ఆత్రం మోతిరామ్  వారు అందజేశారు. ఈ పురస్కారం రావడం పట్ల 
కవులు, రచయితలు
 అతని, సహచర కవులు,
కుటుంబసభ్యులు,బందు మిత్రులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు