సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
  బంధాలు... బాధలు
 *******
బంధాలు లేనివారూ, బాధలు పడని వారు బహుశా ఎవరూ ఉండరు.
బంధాలతో బాధలు పడేవారు చాలా మందే ఉంటారు.
బాధల్లో  ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి ఓదార్చని బంధాలు... పచ్చగా ఉన్నప్పుడు మేమంటే మేమని వచ్చి చేరేవి చాలానే ఉంటాయి.
కష్టాన్ని అనుభవించిన తరువాతే సుఖం విలువ తెలుస్తుంది.
 బాధలతో సతమతం అయ్యేటప్పుడే, బాధ్యతగా మనకు అండగా నిలిచే అసలైన బంధాలేవో తెలుస్తాయి.
అందుకే అప్పుడప్పుడు ఎదురయ్యే బాధలు మంచివే... బంధాలు,బంధుత్వాల అసలు ప్రవర్తన తెలుసుకోవడానికి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు