*తల్లా…పెళ్ళామా!*; సుమ
"ఏవండీ, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ అమ్మనో నన్నో ఎవరినో ఒకరిని మాత్రమే కాపాడాల్సి వస్తే మీరు ఎవరిని కాపాడతారు? మీ అమ్మనా? నన్నా? " చంద్రకాంతం.

'మా అమ్మనే! అనుమానం ఎందుకు?' స్వగతం లో అనుకున్నాడు వీరేశం.

"నిన్నే" అన్నాడు నవ్వుతూ.

"అంటే కనీ పెంచిన తల్లిని వదిలేస్తారా? మీరింత స్వార్థపరులు అనుకోలేదు" గయ్ మంది.

"నువ్వు కోపడతావని అబద్ధం చెప్పానే! మా అమ్మనే కాపాడుతాను" మళ్ళీ నవ్వుతూ.

" అంటే నేను పోయినా ఫర్వాలేదా? పెళ్లి రోజున జీవితాంతం నాకు రక్షణగా నిలబడతాను అని చేసిన ప్రమాణాలు ఉత్తివేనా? ఏది , ఎక్కడ నా అప్పడాలకర్ర? " గర్జించింది చంద్రకాంత0.

కామెంట్‌లు