చిత్రస్పందన //;టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 తనువందున్ దెలి బూది పూత మెడలో తారాడు నాసర్పముల్
కనులందున్ సరి చూపులేదు సెగతో కాల్చున్ గదా జ్వాలగన్
మునుముందున్ వృషభమ్ము భీతిగొలుపన్ భూతమ్ములే సేవకుల్
ప్రణతిన్ నీదరి చేరుటెట్లు శివ!నీ భావంబునే తెల్పుమా!//


కామెంట్‌లు