బడిగంట మోగింది
ఆటవిడుపుకు
విరామం పలికింది !
బడికి పోవాలనే
పసిపిల్లల ఉత్సాహం
బడికి పంపాలనే
తల్లిదండ్రుల ఆరాటం
ఈరోజుతో మొదలయింది !
మండినఎండలతో
కాగిపోయిన శరీరాలతో
చిరుచినుకుల
చల్లని గాలులు
కాసింత ఉపశమనానికి
నాంది పలికాయి ....!
రాబోయే బ్రతుకుబరువు
మోయడం ....
పిల్లలకు ఇప్పటినుండే
బడి సంచితో సాధన
ఇప్పటినుండే మొదలు !
శ్రమించడం ఏమిటో ...
సమయ పాలన ఏమిటో ...
క్రమశిక్షణ ఏమిటో ....
అధ్యయన సమయం
మొదలయ్యేది ఇప్పుడే !
పిల్లలేకాదు ....
తల్లిదండ్రులు సైతం ,
అప్రమత్తంగా -
వుండాలిసిందీ ....
ఇప్పటినుండే ......!!
***
ఫోటోలో:
ఆన్షి.నల్లి.
సికింద్రాబాద్ (సఫిల్ గూడ)
బడిగంట ....!!---డా.కె.ఎల్.వి.ప్రసాద్.-హన్మకొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి