మనసుకి రెక్కలోస్తే;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు
 నా మనసుకే కానీ రెక్కలోస్తే...
సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి నాకు ఎంతో 
ఇష్టమైన మా తాతయ్య ముందు తెలిసీ తెలియక 
చేసిన అల్లరినంత గుర్తు చేసుకుంటూ 
మళ్ళి ఒక్కసారి మా ఊరంతా తిరిగి వస్తా...
నాన్నను పట్టుకొని వదలకుండా 
నేను వెళ్ళనంటూ ఏడుస్తూ మారం చేసి,
బడికి వెళ్ళి భయపడుతూ పలకను పట్టి దిద్దిన 
అక్షరాలను మళ్ళీ ఒక్కసారి దిద్ది వస్తా…
కల్మషం ఎరుగని పసి పాపనై నేను నా అందంమైన బాల్యం
దిశగా సాగిపోతూ మా అమ్మ ఒడిలో ఒదిగిపోయి
అందమైన ఆ చందమామను చూస్తూ అలా
కాసేపు నిద్రించి వస్తా...
చివరగా నేను పుట్టిన వెంటనే 
మొదటగా నన్ను స్పర్శించగానే మా అమ్మ 
కళ్ళలో జారిన ఆ కన్నీటి చుక్కలను 
నా చిట్టి చేతులతో తుడిచి, 
పెదవుల పైన ఆగని ఆ చిరునవ్వును ఒక్కసారి 
నా కళ్ళారా ఆస్వాదించి వస్తా…

కామెంట్‌లు