అగ్నిపథ్;-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 విధ్వంసాల పట్టాల మీద నుండి
దేశభవిత నిర్మించబడుతుందా?
ఆగ్రహానికి అజ్ఞానం తోడై
తగలబడుతున్న వివేకం.
ఆస్తుల ధ్వఙసాలతో అటకెక్కే అభివృద్ధులు కానరావా?
దేశసేవ పరమావధిగా భావించవలసిన సమయంలో
అసంతృప్తుల,అసహనాల,
అనుమానాల,అపోహల
విషవలయంలో చిక్కుకొని,
కూర్చున్న చెట్లను నరుక్కుంటున్న తెలివిహీనత్వం.
ధూమశకటాలపై ధూర్తుల దహనకాండ
సబ్ కే సాత్ సబ్ కా వికాస్
స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న నిర్వీర్యత్వం.
కర్తవ్యనిర్వహణల్లో పాలుపంచుకోవాల్సిన చేతులు
అగ్నిజ్వాలలను రగిలిస్తున్నాయి.
నిద్రలేవండి యువత
దేశభవితే మీ చేతుల్లో ఉందని మరుస్తే ఎలా?
అగ్నిపథం వైపు అక్షయంగా
అడుగులేయండి!
దేశసేవలో పునీతులవ్వండి‌!
నడవండి.....
అగ్నిపథాన..........
అగ్నిపథాన..........
అగ్నిపథాన...........
కామెంట్‌లు