* సర్వభూతాత్మకం *;- కోరాదనరసింహా రావు
ఏక మనేక మైన ఈ సృష్ఠి సమ స్తమూ... చర్య, ప్రతిచర్యలు... 
  సమాహారమే... !

అవసరాలు    -    అవకాశాల
నియంత్రణలోనేకొనసాగుతోంది
బలమైన ప్రాణి సుఖానికి,ఆనం దానికీ  అర్భక ప్రాణులు  బలి !

ఆధిక్యతను చాటుకునేవి...అస్తి త్వాన్ని  నిలబెట్టుకునేవి... ఉని కిని కాపాడుకోగలిగేవి శక్తి, యు క్తులే.... !

ఇది  బలము - బలహీనతల నిరంతర సంఘర్షణ.... !
  ఇరువైపులాసమానబలమైతే
నే సంధి, సర్దు బాట్లు...!!

దయ, జాలి, కరుణ, ప్రేమ..... 
 సర్వ భూతాత్మ ప్రేమ.... 
    ఇవి పరిమళించా లంటే... 
నిష్కల్మష,నిర్మల పసిహృదయ 
మైనా కావాలి...,పూర్ణ పరిపక్వ 
జ్ఞానమైనా రావాలి !!
      *****

కామెంట్‌లు