యోగా!;- సుమ

 మనసుపై పట్టుసాధించాలంటే
దాని మర్మం బాగా తెలియాలి
ఏది సాధించాలన్నా 
మనిషికి మనసే ఆధారం...
నిజానికి మనసు బాహ్యరూపమే మనిషి
మనిషికి బలం బలహీనత మనసే!
మనసును మనసుతోనే జయించాలి
మనసు చంచల స్వభావి...
బాహ్య విషయ వాంఛల వైపు పోకుండా
మనసును ముందు అరికట్టాలి... 
ధ్యానంపై మనసుకు ప్రీతి కలిగించాలి
ధ్యానించాలనే భావనను అలవరచాలి
ధ్యానాన్ని కొనసాగిస్తే మనసు
ఆలోచనారహితమనే సమాధిని చేరుతుంది
యోగా దినోత్సవ శుభాకాంక్షలు🙏
కామెంట్‌లు