ఎవరు నేర్పారమ్మా
ఆ సూర్యునకూ
విశ్వకోటికి
వెలుగు లివ్వాలనీ
ఎవరు నేర్పారమ్మా
చందమామకు
భూజనులకు
హాయి నివ్వాలనీ
ఎవరు నేర్పారమ్మా
పూబాలలకు
పలుకు పలుకులో
మధువు లొలకాలనీ
ఎవరు నేర్పారమ్మా
మేఘమాలకు
వర్షమ్ముతో
హర్షమివ్వాలనీ
ఎవరు నేర్పారమ్మా
ఆ శునకానికి
విశ్వాసము
కలిగి ఉండాలనీ
ఎవరు నేర్పారమ్మా
ఆ చీమకూ
క్రమశిక్షణ
కలిగి ఉండాలనీ
గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి.,
తెలుగు పరిశోధకులు
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి.
తేది:02-06-2022
సెల్: 9493235992.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి