* అందరిలా... హాయిగా... !*కోరాడ నరసింహా రావు.

 కష్టించి... పని చేయుటే గాని... 
సంపాదించేసులువు తెలియదు
జానెడుపొట్టకు జీవనయాతన!
ప్రాణాలను పనం  పెట్టినా.... 
  కూటికి,గుడ్డకు,గూటికికరువే!
ఎండకు ఎండీ... వానకు తడిసే 
అలసీ - సొలసే బ్రతుకులివి !!
తెలివైనవారు సులువుగపొందు
పథకాలేవీ అందుకోలేని....., 
అమాయకు లెందరో మన సమాజాన !
   ఆకలితో... సొమ్మ సిల్లిన మనవని  దలచి విచారించు ఓ 
తాతా.... !
ప్రభుత్వ సాయము పొందే అర్హత పూర్తిగా నీ కున్నా....,
పొందలేని నీ అమాయకత్వం 
వీడవోయి ఇకనైనా.... !
 నీకుచెందవలసినవి,నువ్వుంద వలసినవి పొందీ హాయిగ... 
అందరిలా బ్రతక వోయీ... !!
కామెంట్‌లు